Harish Rao: రైతులను మోసం చేసినందుకు రైతు పండుగ ..! 22 d ago
రైతుబంధును రూపుమాపే ప్రయత్నం చేస్తుండటం దుర్మార్గమని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు మండిపడ్డారు. రైతులకు దక్కిన బోనస్ సుమారు 26 కోట్లు మాత్రమే అని చెప్పారు. రైతుబంధు కంటే బోనస్ అందించడం రైతులకు మేలు ఎలా అవుతుందో చెప్పాలని ప్రశ్నించారు. అన్నదాతలను, కౌలు రైతులను విజయవంతంగా మోసం చేసినందుకు రైతు పండుగ నిర్వహిస్తున్నారు అని విమర్శించారు. రైతుబంధు అమలుపై స్పష్టత ఇవ్వాలని హరీష్ రావు డిమాండ్ చేశారు.